This event is over. See upcoming events
10:00 AM - 10:45 AM (UTC+5.5)
Event Type: Weekly
భగవద్గీత అనే అమృతాన్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్న జిజ్ఞాసువులం మనమంతా. ఒక ప్రసిద్ధ శ్లోకంలో ఇలా చెప్పారు. ఉపనిషత్తులన్నింటిని ఆవులతో పోలిస్తే, శ్రీకృష్ణుడిని గోపాలుడిగా భావిస్తే, అర్జునుడు లేగ దూడ స్థానంలోని వాడు. ఉపనిషత్తుల సారమే గీతామృతం అనే పాలు. దూడకు చేపు వదిలిన తర్వాత మనం పాలు పితుకుకున్నట్లే మనలాంటి జిజ్ఞాసువులందరూ ఆ అమృతాన్ని సేవించే భోక్తలు. ఇంపుగా ఉంటుంది కాబట్టి అమృతం అని కాదు. అజ్ఞానం మృత్యువు లాంటిది అంటుంది వేదాంతం. దాని నుండి కాపాడడానికి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానమే అమృతం. ఇది వేదాంత శాస్త్రంలోని పారిభాషిక పదం.
భగవద్గీతను బ్రహ్మవిద్య అని, యోగశాస్త్రమని, సకల వేదార్థానికి సంగ్రహమని వ్యాఖ్యానించారు. ఇది మనకెందుకు అనే ప్రశ్న రావచ్చు. ఇది అన్ని దేశాలకు, అన్ని కాలాలకు, అందరికీ అవసరమైన విషయం. ప్రపంచంలో ఇవాళ జరుగుతున్న సంస్కృతుల పోరాటాన్ని గమనిస్తే మన మనసుల్లో మెదిలే అనేక ప్రశ్నలకు సమాధానం కావాలంటే భగవద్గీతను తెలుసుకోవాలి. విష్ణువు గొప్పవాడా శివుడు గొప్పవాడా లేదా గణేశుడు అందరికంటే గొప్పవాడా మొదలైన ప్రశ్నలు మన పిల్లలు వేస్తే సమాధానం చెప్పగలగాలి. అందరికంటే గొప్ప దేవుడు ఎవరు, అతడు ఎక్కడ ఉంటాడు అంటే సమాధానం చెప్పగలగాలి., మన సమాజంలో కులవ్యవస్థ ఎలా వచ్చింది దేవుడు సృష్టించాడా అంటే సమాధానానికి భగవద్గీతకు రావాలి.
మనం విగ్రహాన్ని ఎందుకు పూజిస్తున్నాము అంటే సమాధానం కోసం భగవద్గీతకు రావాలి. ఇలాగా ఈనాటి సమాజంలో మన ఎదుర్కొంటున్నటువంటి అనేక సందేహాలకు సమాధానం భగవద్గీతలో దొరుకుతుంది. సమాజంలోని అశాంతికి మూల కారణం ఉపనిషత్తుల సారమైన భగవద్గీతను తెలుసుకోకపోవడమే అని కచ్చితంగా చెప్పవచ్చు. కేవలం మన సమాజమే కాదు ప్రపంచంలో ప్రపంచమంతటా శాంతి నెలకొల్పాలంటే దానికి పునాది భగవద్గీత అని చెప్పవచ్చు.
అలాంటి భగవద్గీతకు శ్రీ శంకర భగవత్ పాదులు విపులమైన వ్యాఖ్యను వ్రాశారు. ఆ వ్యాఖ్యను అర్థం చేసుకొని మన సందేహాల్ని నివారించుకోవడం, అందులో చెప్పిన ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించడం మన భాగ్యం.
తేది 09 జనవరి 2025 నుండి ప్రారంభం
ప్రతి సోమ మరియు బుధ వారములలో
సమయం: ఉదయం 10.00 నుండి 10.45 వరకు